పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం ఓటేయాలని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కోరారు. 'ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నాయి. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా నా ప్రయోజనాలకు లేదా మీ ప్రయోజనాలకు ఉపయోగపడదని నాకు నమ్మకం ఉంది. కానీ, అది దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది' అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు.