ఓట్ చోరీ అయిపోయింది.. ఇప్పుడు సీట్ చోరీ: సీఎం రేవంత్

35చూసినవారు
ఓట్ చోరీ అయిపోయింది.. ఇప్పుడు సీట్ చోరీ: సీఎం రేవంత్
TG: బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను ఆదర్శంగా తీసుకుందని, కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసులు లేకపోయినా ఆమె నామినేషన్ తిరస్కరణ వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో రిటర్నింగ్ అధికారి తప్పుగా వ్యవహరించారని, మొదట ఓట్ల చోరీ, ఇప్పుడు సీట్ల చోరీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్