దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ‘ఓట్ చోరీ’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ శనివారం మణిపుర్‌లో పర్యటించే అవకాశమున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘మణిపుర్ సమస్య చాలా కాలంగా కొనసాగుతోంది. మోదీ అక్కడ పర్యటించడం మంచిదే. కానీ దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్య ‘ఓట్ చోరీ’. హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో ఓట్లను చోరీ చేశారు’ అని వ్యాఖ్యానించారు.