
లగ్జరీ క్యారవాన్ తయారు చేయించుకున్న స్టార్ హీరో (వీడియో)
సినీ నటులు వ్యక్తిగత అవసరాల కోసం క్యారవాన్లను ఉపయోగిస్తుండగా, ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తన కోసం ప్రత్యేకంగా 6.5 కోట్ల రూపాయలతో అత్యంత ఖరీదైన క్యారవాన్‌ను తయారు చేయించుకున్నారు. గ్రే రంగులో, బుల్లెట్ ట్రైన్‌ను పోలి ఉండే ఈ క్యారవాన్పై 'కే' అనే అక్షరం కూడా ఉంది. ప్రస్తుతం 'బిల్ల.. రంగా.. భాషా' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సుదీప్, ఈ కొత్త క్యారవాన్తోనే షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ లగ్జరీ క్యారవాన్ శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.




