ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Dec 11, 2025, 09:12 IST/

అమెరికా రాజకీయాలను కుదిపేస్తోన్న మోదీ, పుతిన్‌ సెల్ఫీ (వీడియో)

Dec 11, 2025, 09:12 IST
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికి, ఒకే కారులో ప్రయాణించి, తీసుకున్న సెల్ఫీ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సిడ్నీ కమ్‌లాగర్, ఈ సెల్ఫీ అనేక సందేశాలు ఇస్తోందని, భారత్‌పై ట్రంప్ ప్రభుత్వ వైఖరి వ్యూహాత్మక భాగస్వామ్యానికి నష్టం చేకూరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ను దూరం చేసుకుంటే అమెరికాకే నష్టమని, వ్యూహాత్మక భాగస్వాములను ప్రత్యర్థుల వైపు మళ్లించడం ద్వారా నోబెల్ బహుమతి గెలవలేరని ట్రంప్‌పై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.