AP: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం భవానీపురం వద్ద నందన్న, గౌరమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఊరేగింపులో డీజే ఏర్పాటు చేశారు. డీజే సౌండ్ తీవ్రతకు ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో గోడ పక్కనే ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు డీజే సిస్టమ్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.