
సెప్టెంబర్లోనూ తక్కువ వర్షపాతమే: IMD
వర్షాలపై భారత వాతావరణ శాఖ (IMD) షాకింగ్ వార్త అందించింది. దేశవ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటికే తక్కువ వర్షపాతం నమోదు కాగా.. సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని IMD తెలిపింది. ఈ నెలలో లాంగ్ పీరియడ్ యావరేజ్ (30-50 ఏళ్ల కాలం) రెయిన్ఫాల్ 167.9mm కాగా, ఈసారి ఏకంగా 91% కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. దీనివల్ల పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






























