వనపర్తి: యువతి అదృశ్యం, కేసు నమోదు.!

959చూసినవారు
వనపర్తి: యువతి అదృశ్యం, కేసు నమోదు.!
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలో జస్వంతి (18) అనే యువతి కనిపించకుండా పోయిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మార్చి 31న ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న జస్వంతి మధ్యాహ్నం కనిపించకుండా పోయింది. బంధువులు, పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. అన్నారం గ్రామానికి చెందిన శివపై అనుమానం వ్యక్తం చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ జగన్మోహన్ ఈ వివరాలను తెలిపారు.