మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం మసిగండ్లపల్లిలో మొహరం పండుగ వేడుకల సందర్భంగా శనివారం రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో ఆగవోని శివ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.