జడ్చర్ల మున్సిపాలిటీలోని గౌరీశంకర్ కాలనీలో శుక్రవారం రాత్రి పిచ్చకుంట్ల మల్లేష్, లలిత దంపతుల మధ్య తగాదా తారస్థాయికి చేరింది. మాట మాట పెరగడంతో భర్త మల్లేష్, క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తితో భార్య లలితను పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో మల్లేష్ అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన లలితను స్థానికులు 108 అంబులెన్సులో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.