మహబూబ్‌నగర్ మండలం అడవి వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. విస్లావత్ పాండు, కవిత దంపతుల రెండేళ్ల కుమారుడు ధనుష్, ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ఆదివారం ధ్రువీకరించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.