నీటి సంపులో పడి రెండేళ్ల బాలిక మృతి

1410చూసినవారు
నీటి సంపులో పడి రెండేళ్ల బాలిక మృతి
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ కుమార్తె వేదాన్షి (2) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. కుటుంబ సభ్యులు చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్