వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ లీకేజీలను అరికట్టి, ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చూడాలని స్పష్టం చేశారు.