మక్తల్: అదుపుతప్పి డిసిఎం బోల్తా.. డ్రైవర్ కు గాయాలు

473చూసినవారు
మక్తల్: అదుపుతప్పి డిసిఎం బోల్తా.. డ్రైవర్ కు గాయాలు
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూర్ మండల కేంద్రంలోని ఓబులాపూర్ గేటు వద్ద కర్ణాటకలోని రాయచూరు నుంచి పొట్టు లోడుతో వస్తున్న మినీ లారీ ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని రక్షించారు.

సంబంధిత పోస్ట్