వనపర్తి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న 130 అబాండెడ్ (వదిలివేసిన) వాహనాలను 6నెలల్లోపు యజమానులు తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి సూచించారు. లేనిపక్షంలో పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 26ప్రకారం వీటిని బహిరంగ వేలం వేస్తామని హెచ్చరించారు. సరైన పత్రాలతో తమవాహనాలను క్లెయిమ్ చేసుకోవాలని తెలిపారు. చట్టపరమైన గడువు ముగిసిన తర్వాత ఆ వాహనాలను ప్రభుత్వ ఆస్తిగా పరిగణించి వేలం నిర్వహిస్తామన్నారు.