వనపర్తి జిల్లా పెబ్బేరులో, వెంకటేశ్, పద్మ దంపతులను అతీత శక్తులున్నాయని నమ్మించి, రూ.3.50 కోట్లు దండుకున్న జవలగేరి దుర్గాసింగ్ అనే కేటుగాడు పరారయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న దంపతులను నాలుగేళ్ల క్రితం కలిసిన దుర్గాసింగ్, పూజల పేరుతో వారిని మోసం చేశాడు. వారి స్వగ్రామంలో దేవతా విగ్రహం ఉందని, దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ ఉందని నమ్మించి, విమానాల్లో ఢిల్లీకి తీసుకెళ్లి ఖర్చు చేయించాడు. కుటుంబానికి ప్రమాదం ఉందని భయపెట్టి డబ్బులు గుంజాడు. అజ్ఞాత వ్యక్తి ఫోన్‌తో అసలు విషయం తెలుసుకున్న దంపతులు మోసపోయినట్లు గ్రహించారు.