వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి, ఖిల్లా ఘణపురం మండలం మానాజీపేట గ్రామానికి చెందిన రాజేష్ రెండేళ్ల కుమారుడు అభిదేవ్ చెవిటి, మూగతో బాధపడుతున్నాడని గుర్తించి, అతని చికిత్స కోసం ప్రభుత్వం నుంచి రూ. 7 లక్షల LOC (Letter of Credit) మంజూరు చేయించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాలుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఆశ్రయించగా, ఆయన ప్రత్యేక దృష్టి సారించి ఈ సహాయాన్ని అందించారు. మంజూరైన LOCని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అందజేశారు.