వనపర్తి జిల్లా, పెద్దమందడి మండల స్థాయిలో పాలమూరు ఎన్. ఆర్. ఐ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు ప్రతిభ పరీక్షలో బలిజపల్లి ఉన్నత పాఠశాల
విద్యార్థులు సత్తా చాటారు. పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం నుంచి హిమశ్రీ, తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ మీడియం నుంచి కవిత ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. వీరికి మండల విద్యాధికారిణి మంజులత చేతుల మీదుగా ఒక్కొక్కరికి 300 రూపాయల నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం వేణుగోపాల్ రెడ్డి, సునీత, శేఖర్, నిరంజన్గౌడ్ విద్యార్థులను అభినందించారు.