తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బీఆర్‌ఎస్ నాయకులు ముందుగానే గగ్గోలు పెట్టడం, తామేదో చేసినట్లు చెప్పుకోవడం పనికిమాలిన వ్యవహారమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి,
కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఒక సమస్యపై చర్యలు తీసుకుంటుందని ముందుగానే తెలుసుకొని, ఆ అంశంపై రాద్ధాంతం చేసి, తాము ఆందోళన చేయడం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పుకోవడం తప్ప ప్రజలకు మీరు చేసిందేమీ లేదని పేర్కొన్నారు.