గద్వాల జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి నుషిత బుధవారం ఒక ప్రకటనలో, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 31 చివరి తేదీ అని, http://www.epass.cgg.gov.in ద్వారా సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.