ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం, అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మున్సిపల్ ఛైర్మన్ నాగమణి రాజేశ్ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.