వనపర్తి పట్టణంలోని డీఎంఆర్ ఆసుపత్రిలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత ఎస్సై స్వాతి మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారని, అపరిచితుల ఫోన్ కాల్స్కు స్పందించి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.