భగత్ సింగ్ జయంతి: దేశభక్తి, పట్టుదల స్ఫూర్తిగా నిలవాలి

215చూసినవారు
భగత్ సింగ్ జయంతి: దేశభక్తి, పట్టుదల స్ఫూర్తిగా నిలవాలి
వనపర్తి పట్టణ ప్రభుత్వ ఎస్సీ కళాశాల బాలుర వసతిగృహంలో ఆదివారం స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వసతిగృహ సంక్షేమ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్, సిబ్బంది భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశభక్తి, పట్టుదల, పుస్తక పఠనం అలవర్చుకోవాలని, మహనీయుల జీవిత చరిత్రల ద్వారా స్ఫూర్తి పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వసతిగృహ సిబ్బంది లక్ష్మి, నాగమ్మ, రజినీకాంత్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్