వనపర్తి జిల్లాలోని అంకూరు గ్రామంలో ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. ఇంటి పక్కన నివసించే తెలుగు కొండయ్య నల్లదిన్నె కడుతుండగా, ఏదుల రామన్ గౌడ్ అభ్యంతరం తెలిపారు. దీంతో కొండయ్య తనపై దాడి చేసి గాయపరిచాడని రామన్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మంగళవారం WNP రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హృషికేష్ తెలిపారు.