చెన్నూరులో తల్లిపాలపై అవగాహన కార్యక్రమం

2చూసినవారు
చెన్నూరులో తల్లిపాలపై అవగాహన కార్యక్రమం
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ శారద సురేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, గర్భిణీలకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మొగులాల్, పంచాయతీ సెక్రెటరీ సురేష్, అంగన్వాడీ టీచర్లు, ANMలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్