వనపర్తి జిల్లాలో శనివారం సీపీఐ పార్టీ కార్యాలయంలో వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ సాగించిన పోరాటం చిరస్మరణీయమని సీపీఐ నేతలు కొనియాడారు. ఎన్ని చిత్రహింసలు ఎదురైనా వెరవకుండా పోరాడిన ఆమె చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నాయకులు రమేష్, కళావతమ్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు గోపాలకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.