అమరచింత పాఠశాలలో పైకప్పు కూలి చిన్నారికి గాయాలు

618చూసినవారు
అమరచింత పాఠశాలలో పైకప్పు కూలి చిన్నారికి గాయాలు
వనపర్తి జిల్లాలోని అమరచింత ZP హై స్కూల్‌లో సోమవారం ఉదయం తరగతి గది పైకప్పు కూలిపోవడంతో పవన్ కుమార్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. గాయపడిన పవన్ కుమార్ ను యశోద ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్