పెబ్బేరు మున్సిపాలిటీ చెలిమిల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం సందర్శించారు. అక్కడ అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదుల భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని త్వరగా విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన బ్రిక్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.