మాజీ శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ, సిట్ విచారణకు చట్టబద్ధత లేదని, సంక్షేమం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, వారి పతనం ఖాయమని అన్నారు. మహిళలకు రూ. 2500, తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా భరోసా, విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రైతు భరోసా, బీమా పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.