వనపర్తిలో నేడు ఉదయం 7:30 గంటలు దాటినా దట్టమైన పొగమంచు వీడకపోవడంతో నగరం తెల్లని దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఎదురుగా ఉన్న భవనాలు కూడా కనిపించనంతగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ చలి తీవ్రత పెరగడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే స్థానికులకు కాశ్మీర్ గుర్తుకొస్తోంది.