వనపర్తి జిల్లాలో హృదయ విదారక ఘటన..!

321చూసినవారు
వనపర్తి జిల్లా పానగల్ మండలం గోప్లాపూర్ లో పేదింటికి చెందిన గంధం సత్యం అనే వ్యక్తి ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఎన్నోసార్లు కోరినా, ప్రజవాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. కిడ్నీ సమస్యతో శనివారం మృతి చెందిన అతడి మృతదేహాన్ని బంధువులు ఖాళీ స్థలంలో టెంట్ వేసి ఉంచగా, రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయింది. ఈ హృదయ విదారక ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్