ఆత్మకూరు పట్టణ శివారులోని పరమేశ్వర స్వామి చెరువుకట్టపై బైక్ అదుపుతప్పి వనపర్తికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మిత్రుల వద్ద భోజనం చేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రవీణ్ కుమార్ ను 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.