మేఘారెడ్డి పరామర్శ: హరీష్ రావు తండ్రికి తూడి మేఘారెడ్డి నివాళులు

237చూసినవారు
గురువారం వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి, ఇటీవల పితృవియోగం చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారిని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన హరీష్ రావు గారి తండ్రిగారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు తెలిపారు.