శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

1చూసినవారు
శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
వనపర్తి శాసనసభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి బుధవారం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. కృష్ణపక్ష చవితి తిథి సందర్భంగా స్వామివారి దర్శనం ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించిందని ఆయన పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే స్వామివారిని ప్రార్థించారు. ఆలయ వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందించారు. ఆర్యవైశ్య సంఘం నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్