వనపర్తిలో దేశవ్యాప్త సమ్మె విజయవంతం

57చూసినవారు
వనపర్తిలో దేశవ్యాప్త సమ్మె విజయవంతం
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం జరిగిన దేశవ్యాప్త సమ్మె వనపర్తిలో విజయవంతమైంది. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ నుండి జూనియర్ కళాశాల మైదానం వరకు భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరిగాయి. సభలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి, పని గంటలను పెంచి, కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్