ఆత్మకూరులో నవరాత్రి ఉత్సవాలు

66చూసినవారు
ఆత్మకూరులో నవరాత్రి ఉత్సవాలు
వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ఆదివారం ఏడవ రోజు మహా చండేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక పూజల్లో బాలరాజు ఆచారి, శ్రీధర్ ఆచారి దంపతులు పాల్గొన్నారు. స్వర్ణకార సంఘం నాయకులు బంగారు భాస్కర్, బంగారు ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు పరమేష్ వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్