వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా వనపర్తిలోని ఆమె విగ్రహానికి సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. భూస్వాములను ఎదిరించి నేల కోసం పోరాడిన ఐలమ్మ తెగువ తెలంగాణ ఆత్మగౌరవానికి, స్త్రీ శక్తికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు శ్రీనివాస్, గంధం నాగరాజు, పరంజ్యోతి, మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.