వనపర్తి జిల్లా, ఉప్పునుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామసభలో సర్పంచ్ సుప్రియ అధ్యక్షతన బడిబాట, జల మహోత్సవం మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు పిల్లలంతా సర్కారు బడిలోనే చదవాలని, ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామంలోకి రాకుండా ఏకగ్రీవ తీర్మానం చేశారు. నీటి సంరక్షణపై కూడా అవగాహన కల్పించారు. ఈ తీర్మానం ద్వారా ప్రైవేట్ పాఠశాలల బస్సులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.