అమరచింతలో టీ ధర పెంచాలంటూ వినతి

392చూసినవారు
అమరచింతలో టీ ధర పెంచాలంటూ వినతి
అమరచింత మండల కేంద్రంలోని టీ షాప్‌ల వ్యాపారులు టీ ధరలను పెంచాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. పెరుగుతున్న పాలు, చక్కెర, టీ పొడి, గ్యాస్ తదితర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న టీ ధరను ₹12 లేదా ₹15కు పెంచాలని కోరారు. టీ ధరల పెంపుపై అధికారులు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీ వ్యాపారస్థులు దుబాయ్ మైను, ఖాదీర్, జహంగీర్ బాబు, షాకీర్, మాక్బుల్, వెంకటేష్, సందీప్, వినోద్, రాజేష్, ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్