బండరాయిపాకుల గ్రామంలో దొంగల బీభ‌త్సం

0చూసినవారు
బండరాయిపాకుల గ్రామంలో దొంగల బీభ‌త్సం
రేవ‌ల్లి మండలం బండరాయిపాకుల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు మూడు ఇళ్లల్లోకి చొరబడి బీరువాలు బద్దలు కొట్టి అందినకాడికి దోచుకున్నారు. దొంగలు ద్విచక్ర వాహనంపై పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాాయి. మంగళవారం పోలీసులు జాగిలాలతో అన్వేషించినా ఆధారాలు లభించలేదు. చేపలవేటకు వెళ్లే ఐదుగురు యువకులను అనుమానంతో విచారణకు తరలించారు. ఎస్సై రజిత విచారణ జరుగుతోందని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్