వనపర్తి పాలిటెక్నిక్ హాస్టల్స్ కు రూ.13.15 కోట్లు మంజూరు

103చూసినవారు
వనపర్తి పాలిటెక్నిక్ హాస్టల్స్ కు రూ.13.15 కోట్లు మంజూరు
తెలంగాణ ప్రభుత్వం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలోని బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు రూ.13.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు హైయ్యర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుంచి GO RT NO 169 జారీ అయింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, ఇంచార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డాక్టర్ మల్లు రవిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.