మహిళల వేధింపులపై షీ టీమ్ ఉక్కుపాదం: ఎస్పీ సునీత రెడ్డి

417చూసినవారు
మహిళల వేధింపులపై షీ టీమ్ ఉక్కుపాదం: ఎస్పీ సునీత రెడ్డి
వనపర్తి జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధించే ఆకతాయిలపై షీ టీమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. సునీత రెడ్డి IPS తెలిపారు. 2025లో షీ టీమ్ పనితీరును వివరిస్తూ, బస్టాండ్లు, పార్కులు, కాలేజీల వద్ద నిఘా పెంచామని, ఈ ఏడాది 8 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, 6 FIRలు, 35 మందిపై epate కేసులు నమోదు చేశామని, 90 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని వెల్లడించారు. 1155 ప్రాంతాల్లో తనిఖీలు, 67 అవగాహన సదస్సులు నిర్వహించారు. వేధింపులకు గురైతే 6303923211 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్