ఆత్మకూరులో బీజేపీకి షాక్: మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నాయకులు

443చూసినవారు
ఆత్మకూరులో బీజేపీకి షాక్: మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నాయకులు
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో బీజేపీ నాయకులు వల్లబ్దాస్ అనిల్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి శ్రీహరి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్ పరమేష్, టౌన్ ప్రెసిడెంట్ నల్గొండ శీను, యువజన నాయకులు తులసి రాజు యాదవ్, గణేష్ ముదిరాజ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్