వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారం గ్రామ పరిధిలోని గండి చెక్పోస్ట్ను మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కఠినంగా పర్యవేక్షించడం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు చూసినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.