శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, తరగతి గదులు, మౌలిక వసతులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు.