వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మాజీ ఉప సర్పంచ్ బండారు యాదయ్య, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖా మంత్రి నారా
లోకేశ్ చిత్రాలను తన ఎదపై పచ్చబొట్టుగా వేయించుకుని పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక
టీడీపీ అభిమానులు యాదయ్య చర్యను మెచ్చుకుంటున్నారు.