వనపర్తి: కొడుకుల వేధింపులపై తండ్రి ఫిర్యాదు

497చూసినవారు
వనపర్తి: కొడుకుల వేధింపులపై తండ్రి ఫిర్యాదు
తన భూమిని తమ పేర్లపై రిజిస్టర్ చేసుకుని, ప్రస్తుతం అన్నం పెట్టకుండా, ఇంటికి రానివ్వకుండా వేధిస్తున్న తన ఇద్దరు కొడుకులపై వనపర్తి జిల్లా మెట్టుపల్లి గ్రామానికి చెందిన హనుమప్ప సోమవారం ప్రజావాణిలో ఎస్పీ సునీత రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో ఒక కుమారుడు మృతి చెందగా, మిగిలిన ఇద్దరు కొడుకులు చిన్నకృష్ణయ్య (హోంగార్డు), రాములు (బంగారు వ్యాపారి) తనను పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు. హనుమప్ప ఫిర్యాదు మేరకు, ఇద్దరు కొడుకులపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. అనంతరం హనుమప్పను ఓదార్చి, చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, వృద్ధాశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్