వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నకిలీ విత్తనాల సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని, సరఫరా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.