వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ లో కోడలు బొగురమ్మ తన అత్త దొడ్డి ఎల్లమ్మ (70) ను ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొట్టి చంపింది. మృతిని సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, ఆదివారం దహన సంస్కారాల సమయంలో మృతురాలి బట్టలపై రక్తపు మరకలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన కూతురు బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం దర్యాప్తు ప్రారంభించారు.