వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఆకస్మికంగా సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని, సేకరించిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే మిల్లులకు తరలించాలని మార్కెట్ యార్డ్ నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు.